టిక్కెట్లు పదిహను నిమిషాల్లోనే క్లోజ్
జనవరి ఆన్ లైన్ టిక్కెట్లను టీటీడీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. టిక్కట్లు పదిహేను నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి
తిరుమల తిరుపతి దర్శనం టిక్కెట్లు ఎప్పుడూ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ముందుగానే భక్తులు టిక్కెట్ల కోసం పోటీ పడతారు. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతున్నా శ్రీవారిని దర్శించుకోవాలన్న తపన భక్తుల నుంచి తొలగలేదు. ఇందుకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసిన టిక్కెట్లు పదిహేను నిమిషాల్లోనే అమ్ముడుపోవడం ఉదాహరణ.
జనవరి నెలకు...
జనవరి నెలకు సంబంధించి ఆన్ లైన్ టిక్కెట్లను టీటీడీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. 9 గంటలకు టీటీడీ టిక్కెట్లు విడుదల చేసిన పదిహేను నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. జనవరి నెలకు సంబంధించి టీటీడీ 2.60 లక్షల టోకెన్లు ను విడుదల చేసింది. అయితే కరోనా నిబంధనలను అనుసరించి దర్శనాలను నిర్వహిస్తామని టీటీడీ చెబుతుంది.