Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. నడిచే వచ్చే భక్తులకు గుడ్ న్యూస్
నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నిన్నటి నుంచే దీనికి సంబంధించి ట్రయల్ రన్ ను అధికారులు ప్రారంభించారు. నడక మార్గం ద్వారా వచ్చే భక్తులు నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకునే వీలుంటుంది. గతంలో ఈ విధానం అమలులో ఉండేది. కానీ కొన్ని కారణాలతో దీనిని తీసివేశారు. అయితే కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం తిరిగి దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం ప్రారంభించింది,
ట్రయల్ రన్ లో...
గురువారం ట్రయల్ రన్ లో భాగంగా ట్రయల్ రన్ ప్రారంభించింది. మొదటి రోజు కేవలం 2,500 టోకెన్లు మాత్రమే ఇచ్చింది. ఈరోజు నుంచి వీటి సంఖ్య ఐదు నుంచి ఆరు వేల రూపాయలకు పెంచనుందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలోని 1200 మెట్ల వద్ద దివ్యదర్శనం టోకెన్లను స్కానింగ్ చేసుకుని నేరుగా దివ్య దర్శనం క్యూ లైన్ లోకి వెళ్లవచ్చు. స్కానింగ్ లేకపోతే దివ్యదర్శన క్యూ లైన్ లోకి అనుమతించారు. ఈ సౌకర్యాన్ని తిరిగి పున:ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.