Tirumala : లడ్డూల విక్రయాలపై అసలు నిజం ఇదీ

తిరమల లడ్డూల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇచ్చింది.

Update: 2024-08-30 06:19 GMT

లడ్డూల విక్రయాలపై తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇచ్చింది. దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకు ఎన్ని లడ్డూలైనా ఇస్తామని చెప్పింది. అయితే దర్శనం చేసుకోకుండా కొందరు లడ్డూలను కౌంటర్ లో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో కొందరు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్పారు. అలాంటి వారికి మాత్రమే ఆధార్ కార్డు చూపితే రెండు లడ్డూలు విక్రయిస్తామని, నెలకు రెండు లడ్డూలు మాత్రమే వారికి ఇస్తామని చెప్పారు.

దళారులకు మాత్రమే...
సామాన్య భక్తులకు మాత్రం లడ్డూలలో రేషన్ విధించలేదని ఆయన తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం భక్తుల ప్రయోజనం కోసమేనని టీటీడీ అధికారులు తెలిపారు. దర్శనం చేసుకుని టోకెన్ తీసుకు వచ్చిన భక్తులకు ఎన్ని లడ్డూలైనా ఇస్తామని తెలిపారు. కేవలం లడ్డూలను విక్రయించే దళారులను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల భక్తులు లడ్డూల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.


Tags:    

Similar News