అమెరికాలోని టోర్నడోలకు తెనాలికి చెందిన చిన్నారులు మృతి
అమెరికాలో పెను తుపాను, టోర్నడోల కారణంగా ఏపీకి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించారు.;

అమెరికాలో పెను తుపాను, టోర్నడోల కారణంగా ఏపీకి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబంలోని చిన్నారులు టోర్నడోలకు బలయ్యారు. కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపిన సమాచారం మేరకు దివంగత గడ్డం థామస్ కుమార్తె షారోన్‌కు, అమెరికాకు చెందిన నథానియేల్ లెవిస్కియాతో 2007వ సంవత్సరంలో వివాహమైంది. వీరు అక్కడి బ్రెవార్డ్ నగరంలో స్థిరపడ్డారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు అమెరికాలో స్థిరపడ్డారు.
చెట్టు విరిగి పడటంతో...
అయితే ఆదివారం వచ్చిన టోర్నడో వల్ల పెద్ద చెట్టు విరిగి వీరు నివాసం ఉంటున్న ఇంటిపై పడింది. ప్రమాదంలో ఒక గదిలో నిద్రిస్తున్న పదమూడేళ్ల జోసయ్యతో పాటు పదకొండేళ్ల జాషువా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. పక్క గదిలోని మిగిలిన కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిల్లలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారన్న సమాచారం తెనాలికి చేరడంతో అమ్మమ్మ మేరిగ్రేస్ థామస్, మేనమామ థామస్ జూనియర్, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారివురూ సోమవారం సాయంత్రం అమెరికా బయల్దేరి వెళ్లారు.