ఏపీలో ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయ్.. జర జాగ్రత్త..?

ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలలో చేరేముందు సదరు యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉన్నది లేనిదీ చెక్ చేసుకోవాలని

Update: 2023-08-03 05:54 GMT

ఆంధ్రప్రదేశ్ లోని రెండు యూనివర్సిటీలు నకిలీవి ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తేల్చింది. ఆ కాలేజీలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని.. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలను యూజీసీ నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 20 ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోనే 8 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని పేర్కొంది. ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలలో చేరేముందు సదరు యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉన్నది లేనిదీ చెక్ చేసుకోవాలని విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది.

ఢిల్లీ-ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌, కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌, యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ, వొకేషనల్‌ యూనివర్సిటీ, ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యురిడికల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌, ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ
యూపీ-గాంధీ హిందీ విద్యాపీఠ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఫర్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ), భారతీయ శిక్షా పరిషద్‌
బెంగాల్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రిసెర్చ్‌
కర్ణాటక- బడగన్వి సర్కార్‌ వరల్డ్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ సొసైటీ
పుదుచ్చేరి- శ్రీ బోది అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌
కేరళ- సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ
మహారాష్ట్ర- రాజా అరబిక్‌ వర్సిటీ


Tags:    

Similar News