తిరుపతి.. రైలు పెట్టెలో మృతదేహం

తిరుపతి నాలుగవ నెంబర్ ప్లాట్ ఫామ్ కు చేరిన చామరాజనగర్- తిరుపతి రైలులోని డి వన్ కోచ్ లో మృతదేహం కనిపించడంతో;

Update: 2022-05-19 05:31 GMT

తిరుపతి రైల్వే స్టేషన్ లో మృతదేహం కలకలం రేపింది. రైలు పెట్టెలో శవం లభ్యమైంది. తిరుపతి నాలుగవ నెంబర్ ప్లాట్ ఫామ్ కు చేరిన చామరాజనగర్- తిరుపతి రైలులోని డి వన్ కోచ్ లో మృతదేహం కనిపించడంతో అందరూ టెన్షన్ పడ్డారు. కొందరు ప్యాసింజర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

తిరుపతి నాలుగవ నెంబర్‌ ప్లాట్‌ ఫామ్‌కు చేరిన చామరాజనగర్‌- తిరుపతి రైలులోని డి వన్‌ కోచ్‌లో మృతదేహం ఉన్నట్లు ప్యాసింజర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మతుడి వయస్సు 60-70 మధ్య ఉంటుందని ఎర్ర మట్టి కలర్‌ ఫ్యాంటు, ఎరుపు, నలుపు, తెలుపు గళ్ళ ఫుల్‌ షర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. మతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు తిరుపతి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.


Tags:    

Similar News