బెయిల్ పై ఉన్నోళ్లు జైలుకెళ్లక తప్పదు

బెయిల్ పై ఉన్న కొందరు నేతలు త్వరలో జైలుకు వెళతారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు;

Update: 2021-12-28 12:32 GMT

బెయిల్ పై ఉన్న కొందరు నేతలు త్వరలో జైలుకు వెళతారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ వివిధ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. దీంతో సహజంగా జగన్ పైనే ప్రకాష్ జవదేకర్ ఈ వ్యఖ్యాలు చేశారా? అన్న అనుమానం కలుగుతుంది. ఏపీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుందని చెప్పారు. ఆరున్నర లక్ష కోట్ల అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా వెనకబడి ఉందని చెప్పారు.

సర్వనాశనం చేశారు....
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని బీజేపీ నేతలు అన్నారు. నవరత్నాల పేరుతో నిలువు దోపిడీ జరుగుతుందని చెప్పారు. ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. కమ్యునిస్టులు మొరిగే కుక్కలని సోము వీర్రాజు అన్నారు. వారు జెండాలతో జగడానికి మాత్రమే వస్తారన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కదా అని తాము వేచి చూశామని సీఎం రమేష్ చెప్పారు. రాష్ట్ర సంపద మొత్తాన్ని కరిగించేశారన్నారు. అక్రమ మైనింగ్ లతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు.
ముప్ఫయి నెలల పాలనలోనే....
జగన్ ముప్ఫయి నెలల పాలనపై ఆయనకే నమ్మకం లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆ నమ్మకమే ఉంటే పీకే అవసరం మళ్లీ ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. సినిమా రేట్లను తగ్గించారని, దానికి తాము వ్యతిరేకం కాదని, భారతీ సిమెంటు ధరలు కూడా తగ్గిస్తే బాగుంటుందని సూచించారు. విధ్వంసకర ఆలోచనలతో పాలన జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి పురంద్రేశ్వరి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని పురంద్రీశ్వరి అన్నారు. వ్యాపారవేత్తలు భయపడిపోతున్నారని, రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. అమరావతికి అన్యాయం చేశారని చెప్పారు.


Tags:    

Similar News