అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్
మొన్నటి వరకూ కాకినాడ జిల్లాలో సంచరించి బెంగాల్ టైగర్ అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది.
మొన్నటి వరకూ కాకినాడ జిల్లాలో సంచరించి బెంగాల్ టైగర్ అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. ఇక్కడ స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గంధవరంలో గేదె పై పులి దాడి చేసింది. ఈ విషయాన్ని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు అప్రమత్తమయ్యారు. పులి గ్రామంలోకి వస్తుందన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.
కాకినాడలో....
దాదాపు నెల రోజులకు పైగానే బెంగాల్ టైగర్ కాకినాడ జిల్లాలో సంచరించింది. ఆవులు, గేదెలను చంపింది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోనులు ఏర్పాటు చేసినా దగ్గరకు వచ్చి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. అదే పులి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.