Vasireddy Padma : వాసిరెడ్డి చేరికకు డేట్ ఫిక్స్
వాసిరెడ్డి పద్మ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారయినట్లు తెలిసింది.
వాసిరెడ్డి పద్మ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారయినట్లు తెలిసింది. ఈ నెల 9వ తేదీన ఆమె టీడీపీలో చేరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె కూడా తాను త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించార. వైసీపీ నేతగా ఉన్న వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేసి చాలా రోజులయిన సంగతి తెలిసిందే.
అభ్యంతరం చెప్పడంతో...
అయితే కొందరు టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఆమె చేరిక ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. కానీ చివరకు ఆమె చేరికకు అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని చెబుతన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈనెల 9న తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది.