ఈమె కూడా ఊహించలేదట

టీడీపీ నుంచి రాజకీయం మొదలుపెట్టిన విడదల రజనీ తర్వాత వైసీపీలో చేరి చిలకలూరిపేట టిక్కెట్ ను దక్కించుకుని విజయం సాధించారు.;

Update: 2022-04-11 06:59 GMT
vidadala rajani, minister,new cabinet, andhra pradesh
  • whatsapp icon

అందరూ అంటున్నారు కాని విడుదల రజనీకి మంత్రి పదవి వస్తుందని ఆమె కూడా ఊహించలేదు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన విడదల రజనీ తర్వాత వైసీపీలో చేరి చిలకలూరిపేట టిక్కెట్ ను దక్కించుకుని విజయం సాధించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చిలకలూరి పేట లో మర్రి రాజశేఖర్ సీనియర్ నేత ఉన్నప్పటికీ ఆయనను కాదని రజనీకి టిక్కెట్ ఇవ్వడం అప్పట్లో సంచలనం అయింది. ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి ఇప్పుడు మంత్రి పదవిని దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా బీసీ కోటా కింద ఆమెకు మంత్రి పదవి లభించింది.


Tags:    

Similar News