ఆర్థికరంగంపై నీలినీడలు.. సాయిరెడ్డి ట్వీట్
రష్యా యుద్ధోన్మాదం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు
రష్యా యుద్ధోన్మాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. క్రూడాయిల్ ధరలు బ్యారెల్ కు 112 డాలర్లకు ఎగిసిపడటం దీనికి ముందస్తు సంకేతమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరోసారి ఆర్థిక రంగంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఏపీ విద్యార్థులను....
అదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులను వెనక్కు తీసుకు వచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు విద్యార్థులను క్షేమంగా ఏపీకి తీసుకు వచ్చేందుకు పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని జగన్ అధికారులను ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.