పవన్ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేశాడు. గత రెండు రోజుల నుంచి వరసగా బెదరింపు కాల్స్ చేస్తూనే ఉన్నాడు. దీంతో హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఆదేశించారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
విజయవాడ నగరం నుంచే...
అయితే విజయవాడ నగరంలోనే బెదిరించి వ్యక్తి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అతడి కోసం వెదుకులాడి , ఫోన్ నెంబరు ఆధారంగా అరెస్ట్ చేశారు. ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే ఆగంతకుడు హోం మంత్రి అనితకు కూడా ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిసింది.