Janasena : జనసేనను వీడనున్న మరో నేత

నంద్యాలకు చెందిన విశ్వనాధ్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరనున్నారు.;

Update: 2024-04-18 04:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని కూడా నేతలు వీడుతున్నారు. తమకు టిక్కెట్లు దక్కకపోవడంతో ఇతర పార్టీలవైైపు చూస్తున్నారు. తాజాగా నంద్యాలకు చెందిన విశ్వనాధ్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. పొత్తులో భాగంగా నంద్యాల టిక్కెట్ ను విశ్వనాధ్ ఆశించారు.

టిక్కెట్ దక్కక పోవడంతో...
అయితే టిక్కెట్ కూటమిలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఎన్‌ఎండీ ఫరూక్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో శిల్లా రవి ఆహ్వానం మేరకు విశ్వనాధ్ వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. వరసబెట్టి జనసేన నేతలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీ అభిమానులను ఆందోళనలో పడేస్తుంది. అంతే కాదు ఎన్నికల సమయానికి మరెంత మంది జారుకుంటారో అన్నది తేలకుండా ఉంది.


Tags:    

Similar News