AP Volunteer: వాలంటీర్ల విషయంలో మాట నిలబెట్టుకునే దిశగా!!
వాలంటీర్ల విషయంలో ఏపీలో కాస్త సస్పెన్స్ కొనసాగుతూ ఉంది
వాలంటీర్ల విషయంలో ఏపీలో కాస్త సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెబుతుందా? లేదా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సమయంలో మాట నిలబెట్టుకునే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. తాజాగా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ప్రకటించారు. వలంటీర్ వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలంటూ వైసీపీ నేత శివప్రసాద్‌రెడ్డి సభలో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి వీరాంజనేయులు సమాధానమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. వారికి ఇస్తున్న గౌరవ వేతనం పెంపుపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సభకు నివేదించిన ప్రశ్నకు మంత్రి డోలా వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు.
ఇక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్, బుక్ బ్యాంక్ స్కీమ్, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, భూమి కొనుగోలు పథకం, భూమి అభివృద్ధి పథకం, విదేశీ విద్య, ఉచిత బల్బులు వంటి పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకోస్తామని ప్రభుత్వం తెలిపింది.