Holiday: ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. సోమవారం సెలవు

భారత వాతావరణ సంస్థ ఏపీకి భారీ వర్ష సూచన చేసింది

Update: 2024-09-08 15:10 GMT

భారత వాతావరణ సంస్థ ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉంది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు.


Tags:    

Similar News