Weather Report: గుడ్ న్యూస్.. వర్షాలే వర్షాలు
ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ
ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే ఐదు రోజులు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావానికి తోడు, ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.