ఏపీలో ఈ ప్రాంతాలకు వర్షాలు
ఏపీలో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం
ఏపీలో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి. వాతావరణశాఖ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం మీదుగా కోస్తాపైకి తేమతో కూడిన గాలులు వీచాయి. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతూ ఉండడంతో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి
తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మెల్లగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి కాస్త తీవ్రంగా ఉంది. తెలంగాణలో రాత్రివేళ తక్కువగా 19 డిగ్రీల సెల్సియస్, నమోదవుతూ ఉంది. తెలంగాణలో మధ్యాహ్నం వేళ 31 శాతం తేమ ఉంటుంది. ఏపీలో మధ్యాహ్నం వేళ 57 శాతం తేమ ఉంటుంది. పశ్చిమ రాయలసీమలో మాత్రం 45 శాతం ఉంటుంది.