Ys Bharathi : జగన్ బస్సు వెళుతుండగా భారతి వచ్చి..?

వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర తాడేపల్లికి చేరుకున్న సమయంలో ఆయన సతీమణి భారతి బయటకు వచ్చి జనంలో కలసి ఆయనకు అభివాదం చేశారు;

Update: 2024-04-13 12:21 GMT
Ys Bharathi : జగన్ బస్సు వెళుతుండగా భారతి వచ్చి..?
  • whatsapp icon

వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర తాడేపల్లికి చేరుకున్న సమయంలో ఆయన సతీమణి భారతి బయటకు వచ్చి జనంలో కలసి ఆయనకు అభివాదం చేశారు. గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. తాడేపల్లి జగన్ నివాసం నుంచి యాత్ర వెళుతుండటంతో జగన్ సతీమణి భారతి జగన్ ను చూసేందుకు బయటకు వచ్చారు. తన కుటుంబ సభ్యులతో పాటు జనంలోకి వచ్చిన భారతి బస్సులో వెళుతున్న జగన్ కు ఆమె అభివాదం చేశారు.

27న ఇడుపులపాయ నుంచి...
గత నెల 27వ తేదీన జగన్ బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. మేమంతా సిద్ధం పేరుతో అన్ని జిల్లాలను చుట్టి వస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా జగన్ నేడు 14వ రోజుకు కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు. తాడేపల్లి ఆయన నివాసానికి వెళ్లకుండానే జగన్ రాత్రి నైట్ క్యాంప్ లో బస చేశారు. ఈరోజు తాడేపల్లి మీదుగా వెళుతుండగా భారతి వచ్చి అభివాదం చేయడంతో జగన్ కూడా చేతులు ఊపి ఆమెకు అభివాదం తెలిపారు.


Tags:    

Similar News