వరద కొల్లేరుకు పాకిందిగా?

నిన్నటివరకూ విజయవాడ వరద నీటిలో ఉండగా నేడు కొల్లేరు ప్రాంతానికి పాకింది. కొల్లేరు వరద నీటితో నిండుగా కనిపిస్తుంది.;

Update: 2024-09-04 06:52 GMT
flood water, spread, vijayawada,  kolleru
  • whatsapp icon

నిన్నటివరకూ విజయవాడ వరద నీటిలో ఉండగా నేడు కొల్లేరు ప్రాంతానికి పాకింది. కొల్లేరు వరద నీటితో నిండుగా కనిపిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాలు, వరద నీరు కొల్లేరుకు చేరడంతో అది నిండిపోయింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కొల్లేరుకు నీరుచేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే వరద నీరు కైకలూరు - ఏలూరు రోడ్డు పై ప్రవహిస్తుంది. మండవెల్లి పరిసర ప్ర్రాంతాల్లో కూడా వరద నీరు ప్రవహిస్తుంది.

వాహనాల మళ్లింపు...
దీంతో ఏలూరు మార్గంలో రెండు అడుగుల మేర రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కైకలూరు - ఏలూరు రోడ్డులో వాహనాలను వెళ్లనివ్వకుండా పోలీసులు మరో దారిలో వెళ్లమని సూచిస్తున్నారు. కొల్లేరు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా ఇళ్లను ఖాళీ చేసి బయటకు రావాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Tags:    

Similar News