TDP : వైసీపీ నేతలకు యరపతినేని హామీ.. ఏం ఇచ్చారంటే?
ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన తర్వాత కూటమి పార్టీల శ్రేణులు సంతోషంగా ఉన్నారని గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు అన్నారు
ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన తర్వాత టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు చాలా సంతోషంగా ఉన్నారని గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు అన్నారు. అవమానాలను భరించి, ఇబ్బందులను అధిగమించి, తప్పుడు కేసుల్ని ఎదుర్కొని కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా, మూడు పార్టీల కూటమి కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు తెలిపారు. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చామని, ప్రజలు వన్ సైడ్ గా తీర్పు ఇచ్చారన్నారు. బాధ్యతలు పెరిగాయని, ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని మనం బాధ్యతగా అందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి వైపు గురజాల నియోజవర్గాన్ని తీసుకెళ్లాలని యరపతినేని శ్రీనివాసరావు కోరారు.
వ్యాపారాల్లో జోక్యం...
దయచేసి మీకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ్వరు కూడా వైసీపీ వాళ్ల మీద గానీ, ఎవ్వరి మీద గానీ దాడులకు పాల్పడవద్దని పిలుపు నిచ్చారు. ఎవరూ ఇతరుల వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరారు. ఎందుకంటే వాళ్ళ అరాచకాలు ఏ విధంగా జరిగాయో మనం చూశామని, వాళ్ళు చేసినట్లుగానే మనం చెయ్యకూడదన్నారు. మనం అభివృద్ధి పదంలో మన నియోజకవర్గాన్ని తీసుకెళ్దామనేనారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళకి ఇబ్బందులు తప్పవని, అవన్నీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుందామని, వ్యక్తిగతంగా ఎవ్వరి మీద దాడులకు పాల్పడవద్దని, ఎవ్వరూ వ్యాపారుల జోలికి పోవద్దన్నారు. ఎవరైనా వ్యాపారాలకు అడ్డుపడితే తనకు ఫోన్ చేయాలని, తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.