Ys Jagan : విద్యుత్తు ఛార్జీలు మీరు పెంచి.. నిందలు మాపైనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి కానుకగా విద్యుత్తు ఛార్జీలు పెంచుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నింటినీ చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని, ముప్ఫయి శాతం తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్తు ఛార్జీలు పెంచుతూ ఇచ్చిన మాటను తప్పుతున్నారన్నారు. 6,072 కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపడం సమంజసమేనా? అని వైఎస్ జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వమే భరించాలని...
ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారుల చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా పెంచుతున్నారన్నారు. కాగా విద్యుత్తు ఛార్జీలు పెంచుతూ ఆ నెపాన్ని వైసీపీ పై నెట్టేందుకు ప్రయత్నించడం ఏంటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే అది తమ ఖాతాలో, పన్నులు వేస్తే దానిని వైసీపీ ఖాతాలో వేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.