Ys Jagan : 21న కడప జడ్పీటీసీలతో జగన్ సమావేశం

కడప జిల్లా జడ్పీటీసీలతో వైసీపీ అధినేత జగన్ ఈ నెల 21న తాడేపల్లి కార్యాలయంలో సమావేశం అవుతున్నారు

Update: 2024-08-17 04:13 GMT

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరూ టీడీపీలోకి జంప్ అవుతున్నారు. అనేక మున్సిపాలిటీలను ఇప్పటికే టీడీపీ సొంతం చేసుకుంది. దీంతో కడప జిల్లాల్లో జడ్పీ పీఠంపై కూడా టీడీపీ కన్నేసినట్లు తెలియడంతో వైసీపీ అగ్రనాయకత్వం అప్రమత్తమయింది. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధినాయకత్వం పిలుపు నిచ్చింది. 21వ తేదీన విజయవాడకు రావాలంటూ కోరింది. జగన్ వారితో నేరుగా సమావేశమవుతారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాధరెడ్డి రాజీనామా చేయడంతో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది.

జడ్పీ ఛైర్మన్ పదవిని...
ఆకేపాటి అమరనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో జడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కడప జిల్లాలో యాభై జడ్పీటీసీ స్థానాలుండగా అందులో 48 జడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు. రెండు జడ్పీటీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి మినహా 47 మంది వైసీపీకి చెందిన జడ్పీటీసీలే. దీంతో వారందరితో ఈ నెల 21వ తేదీన జగన్ సమావేశం కానున్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ తామే సొంతం చేసుకునేలా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ఈ నెల 21న కడప జిల్లా జడ్పీటీసీలో ఆయన సమావేశం అవుతున్నారు.


Tags:    

Similar News