YSRCP : ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్
వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఛాంబర్‌లో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు;
వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఛాంబర్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన ఛాంబర్ కు వెళ్లిన ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ఆయన కాసేపు మాట్లాడారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు.
అవకాశం వస్తే...
తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చని, అవకాశం వస్తే మన ప్రభుత్వంలో జరిగిన మంచిపనుల గురించి చెప్పాలని, కానీ అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేసేలా వత్తిడి తేవాలని సూచించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.