Ys Jagan : జమిలి ఎన్నికలపై జగన్ ఏమన్నారంటే?
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు
ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందరూ సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఆయన ఈరోజు వర్క్‌షాప్ లో మాట్లాడుతూ నేతలకు దిశానిర్దేశం చేశారు. యాక్టివ్ గా ఉన్న నేతలకే అవకాశాలు ఇస్తామని జగన్ అన్నారు. ప్రతి ఒక్కరి పనితీరుకు రేటింగ్ కూడా ఇస్తామని జగన్ తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడితేనే ప్రజల్లో మరోసారి విశ్వాసం పొందుతామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్న జగన్ హామీలు అమలు చేయకపోవడం, చెప్పిన వన్నీ అబద్ధాలేనని తేలడంతో ప్రతి ఇంట్లో చర్చ మొదలయిందని జగన్ అన్నారు.
కష‌్టపడి పనిచేసిన వారికే...
తాము అధికారంలో ఉన్నప్పుడు దక్కిన ప్రయోజనాల గురించి చర్చ చేసుకుంటున్నారని జగన్ అన్నారు. రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని జగన్ కోరారు. కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా పార్టీ పరంగా గుర్తింపు ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఇకపై తాను కూడా ప్రజల్లో ఉండేలా ప్రణాళికలను రూపొందించుకుంటానని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించిన వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని తెలిపారు.