Ys Jagan : చంద్రబాబుపై జగన్ ఫైర్.. నిజం ఒప్పుకోమన్న వైసీపీ చీఫ్

వైసీపీ అధినేత జగన్ ఈరోజు విజయవాడలోని వరద బాధతులను పరామర్శించారు.

Update: 2024-09-04 12:11 GMT

వైసీపీ అధినేత జగన్ ఈరోజు విజయవాడలోని వరద బాధతులను పరామర్శించారు. రాజరాజేశ్వరి పేట ను సందర్శించి అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. జగన్ వైసీపీ తరుపున వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన తర్వాత ఆయన మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల గురించి ప్రజలను సరైన సమయంలో అప్రమత్తం చేయకపోవడంతోనే ఇంతటి దారుణమైన విపత్తు జరిగిందని ఆయన అన్నారు. పునరావాస కేంద్రాలను కూడా తగినన్ని ఏర్పాటు చేయలేదన్నారు.

తన ఇల్లు మునిగిపోబట్టే...
వరదలో తన ఇల్లు మునిగిపోయింది కాబట్టి వచ్చి కలెక్టరేట్ లో ఉన్నారని జగన్ అన్నారు. తానేదో ప్రజల కోసం ఇక్కడ ఉన్నట్లుగా బిల్డప్ ఇచ్చారని జగన్ ఎద్దేవా చేశారు. బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమయిందన్న జగన్ తమ పాలనలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు దాదాపు ముప్పయి వేల మందిని రిలీఫ్ క్యాంప్ లకు తరలించామని గుర్తుచేశారు.ఉత్త చేతులో పంపించకుండా తక్షణ పరిహారాన్ని అందచేశామని జగన్ తెలిపారు. ఆయన చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ఇలా ఉండేది కాదని జగన్ అన్నారు.


Tags:    

Similar News