Ys Jagan : నేడు విజయవాడకు వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు;

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. నిన్నటి వరరకూ పులివెందులలో పర్యటించిన జగన్ నేడు విజయవాడ పర్యటకు వస్తున్నారు. ఈరోజు విజయవాడలో జరిగే ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గురునానక్ కాలనీ ఎన్‌ఏసీ కళ్యాణమండపానికిచేరకుంటారు.
ఇఫ్తార్ విందుకు...
అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు, అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముండటంతో కేవలం ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారినే లోపలకి అనుమతించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.