Ys Jagan : జగన్ రాజకీయాలను వదిలేసి హిమాలయాలకు వెళదామనుకున్నారా? నిజమెంత?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

Update: 2024-06-29 05:50 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన పార్టీ నేతలతో ఓటమిపై మాట్లాడుతూ తాను ఎన్నికల ఫలితాలు చూసిన వెంటనే అన్నీ వదిలేసి రాజకీయాలకు వెళ్లిపోదామని భావించానని, అయితే ఎన్నికలలో ప్రజలు నలభై శాతం వైసీపీ వైపు ఉండటంతో ఆగిపోయానని జగన్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పార్టీ నేతలతో సమావేశమై ఓటమిపై సమీక్షించారు.

ఎన్ని మంచి పనులు చేసినా...
తాను ఎన్ని మంచి పనులు చేసినా ఇంత దారుణ ఓటమిని ఊహించలేదని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తనకు ఫలితాల షాక్ నుంచి తేరుకోవడానికి మూడు రోజులు సమయం పట్టిందన్న జగన్ తాను ఈరకమైన ఫలితాలు వస్తాయని ఊహించలేదన్నారు. తాను రాజకీయాలను వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామని భావించానని కూడా ఆయన అన్నట్లు నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. సీట్లు రాకపోయినా నలభై శాతం ఓట్లు మనకు రావడంతో ప్రజలు మనవైపు ఉన్నారని, ప్రజల కోసం నిలబడాలని నిర్ణయించుకుని తాను ఓటమి బాధ నుంచి బయటపడ్డానని నేతలతో అన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజనిజాలు మాత్రం తెలియక పోయినప్పటికీ జగన్ ఈ రకమైన ఫలితాలు చూసి కొంత షాక్ కు గురయ్యారని మాత్రం నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News