Ys Jagan : నేడు రెండో రోజు పులివెందులలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు రెండో విడత పర్యటన పులివెందులలో సాగుతుంది. ఆయన ప్రజలతో నేరుగా సమావేశం అవుతున్నారు.

Update: 2024-10-30 03:48 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు రెండో విడత పర్యటన పులివెందులలో సాగుతుంది. ఆయన ప్రజలతో నేరుగా సమావేశం అవుతున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. నిన్న కూడా పులివెందులలోని జగన్ కార్యాలయానికి పెద్దయెత్తున ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను జగన్ కోరారు.

ప్రజాదర్బార్ లో...
ఆయన క్యాంప్ కార్యాలయంలోనే పార్టీ కార్యకర్తలు, నేతలతో కూడా భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతంతో పాటు అధికార పార్టీ అమలు చేస్తున్న విధానాలపై ఆందోళనలకు దిగాలని నేతలకు సూచిస్తున్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై ఆందోళన చేయాలని చెబుతున్నారు. ప్రజా దర్బార్ లో అనేక వినతులు వస్తుండటంతో రేపు కూడా జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది.


Tags:    

Similar News