YCP candidates : లిస్ట్‌ను విడుదల చేసిన జగన్ .. సెంటిమెంట్ ఫాలో అయిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో వీరే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు

Update: 2024-03-16 07:56 GMT

YCP candidates :వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో వీరే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి కడపకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. రెండో సారి అధికారంలోకి వచ్చే దిశగా ఆయన సెంటిమెంట్ ను ఎంచుకున్నారు. గత ఎన్నికల సమయంలోనూ వైఎస్సార్ ఘాట్ వద్దనే అభ్యర్థుల జాబితాను జగన్ విడుదల చేశారు. ఒకేసారి అభ్యర్థులందరిని ప్రకటించడం వైసీపీ స్పెషాలిటీ. అయితే ఈ జాబితాలో పెద్దగా మార్పులు లేవు. గత ఎన్నికల మాదిరిగానే బలహీన వర్గాలకు చెందిన ధర్మాన ప్రసాదరావు, దళిత వర్గానికి చెందిన నందిగం సురేష్ లు జాబితాను విడుల చేశారు.

రెండు నెలలు కసరత్తు చేసిన...
ఇటీవల రెండు నెలల పాటు కసరత్తులు చేసి సమన్వయ కర్తలను నియమించిన జగన్ వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా సమన్వయకర్తలనే అభ్యర్థులుగా జగన్ తన జాబితాలో చోటు కల్పించారు. అభ్యర్థులందరూ ఇక ప్రజల్లోనే ఉండాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అభ్యర్థులు ఎవరూ ఆత్మవిశ్వాసంతో పనిచేయవద్దని, ఈ రెండు నెలలూ శ్రమించాల్సిందేనని అన్నారు. కార్యకర్తలతో పాటు పార్టీ నేతలను కలుపుకుని ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. సామాజిక మార్పు దిశగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.
సీట్ల కేటాయింపు ఇలా...
పార్లమెంటు స్థానాల్లో ఇరవై అయిదులో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు పదకొండు, ఓసీలకు తొమ్మిది సీట్లను కేటాయించామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో అన్ని కలిపి 200 ఉండగా, వీటిలో 33 ఎస్సీలకు, ఎనిమిది ఎస్టీలకు, 59 బీసీలకు, ఓసీలకు 100 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. మైనారిటీలకు కూడా గతం కంటే అదనంగా సీట్లను కేటాయించామని తెలిపారు. మైనారిటీలకు ఈసారి ఏడు అసెంబ్లీ స్థానాలను ఇచ్చామని చెప్పారు. మహిళలకు, బీసీలకు కూడా ఈ జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడంలో వైసీపీని మించిన పార్టీ మరొకటి లేదన్నారు. 14 మంది పార్టీ కార్యకర్తలకు అసెంబ్లీ స్థానాలను కేటాయించామని తెలిపారు.

పార్లమెంటు అభ్యర్థులు

శ్రీకాకుళం - పేరాడ తిలక్
విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్
విశాఖపట్నం - బొత్స ఝాన్సీ
అరకు - చెట్టి తనూజా రాణి
రాజమండ్రి - గూడూరి శ్రీనివాస్
నరసాపురం - గూడూరి ఉమాబాల
అమలాపురం - రాపాక వరప్రసాద్
కాకినాడ - చెలమలశెట్టి సునీల్
ఏలూరు - కారుమూరి సురేష్ కుమార్ యాదవ్
మచిలీపట్నం - డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్
విజయవాడ - కేశినేని నాని
నరసరావుపేట - అనిల్ కుమార్ యాదవ్
బాపట్ల - నందిగం సురేష్ బాబు
ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నెల్లూరు - వేణుంబాక విజయసాయిరెడ్డి
తిరుపతి - గురుమూర్తి
చిత్తూరు - రెడ్డప్ప
రాజంపేట - మిధున్ రెడ్డి
కడప - వైఎస్ అవినాష్ రెడ్డి
కర్నూలు - బీవై రామయ్య
నంద్యాల - బ్రహ్మానందరెడ్డి
హిందూపురం - శాంతమ్మ
అనంతపురం - శంకరనారాయణ
ఎమ్మెల్యే అభ్యర్థులు...

శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు

ఆమదాలవలస – తమ్మినేని సీతారాం

పాతపట్నం - రెడ్డి శాంతి

నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్‌

టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్‌

ఇచ్ఛాపురం - పిరియా విజయ

పలాస – సీదిరి అప్పలరాజు

రాజాం - డాక్టర్‌ రాజేష్‌

విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి

బొబ్బిలి - వెంకట చిన అప్పలనాయుడు

గజపతినగరం - బొత్స అప్పలనరసయ్య

నెల్లిమర్ల – బి.అప్పలనాయుడు

నరసాపురం - ప్రసాదరాజు

ఆచంట – శ్రీరంగనాథరాజు

ఉండి - పి.వి.ఎల్.నరసింహరాజు

తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ

పాలకొల్లు - గుడాల శ్రీహరి గోపాల్‌రావు

నూజివీడు - మేకా వెంకట ప్రతాప అప్పరావు

దెందులూరు - అబ్బయ్యచౌదరి

కైకలూరు - దూలం నాగేశ్వరరావు

పామర్రు - కైలే అనిల్‌కుమార్‌

అవనిగడ్డ – సింహాద్రి రమేష్‌బాబు

మచిలీపట్నం - పేర్ని వెంకట కృష్ణమూర్తి(కిట్టు)

గుడివాడ – కొడాలి నాని

విజయవాడ పశ్చిమ – షేక్‌ ఆసిఫ్‌

విజయవాడ సెంట్రల్‌ - వెల్లంపల్లి శ్రీనివాస్‌

జగ్గయ్యపేట – ఉదయభాను

తాడికొండ – సుచరిత

ప్రత్తిపాడు - కిరణ్‌కుమార్‌

తెనాలి - అన్నాబత్తుని శివకుమార్‌

పొన్నూరు - అంబటి మురళీకృష్ణ

గుంటూరు పశ్చిమ – విడదల రజిని

మంగళగిరి - మురుగుడు లావణ్య

గుంటూరు తూర్పు - షేక్‌ నూర్‌ ఫాతిమా

పెదకూరపాడు - నంబూరి శంకర్‌రావు

వినుకొండ – బొల్లా బ్రహ్మనాయుడు

సత్తెనపల్లి - అంబటి రాంబాబు

గురజాల – కాసు మహేష్‌రెడ్డి

మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

రేపల్లె - ఈవూరి గణేష్‌

బాపట్ల – కోన రఘుపతి

వేమూరు - వరికూటి అశోక్‌బాబు

సంతనూతలపాడు - మేరుగు నాగార్జున

అద్దంకి - పాణెం చిన హనిమిరెడ్డి

పర్చూరు - యడం బాలాజీ

చీరాల – కరణం వెంకటేష్‌

గిద్దలూరు - నాగార్జునరెడ్డి

ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి

మార్కాపురం - అన్నా రాంబాబు

కందుకూరు - మధుసూదన్‌ యాదవ్‌

కావలి - రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి

నెల్లూరు సిటీ - ఖలీల్‌ అహ్మద్‌

కోవూరు - ప్రసన్నకుమార్‌రెడ్డి

ఆత్మకూరు - మేకపాటి విక్రమ్‌రెడ్డి

సర్వేపల్లి - కాకాని గోవర్దన్‌రెడ్డి

గూడూరు - మురళి

శ్రీకాళహస్తి - మధుసూదనరెడ్డి

సూళ్లూరుపేట – సంజీవయ్య

వెంకటగిరి - నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

సత్యవేడు - నూకతోటి రాజేష్‌

కుప్పం - జయేంద్ర భరత్‌

పలమనేరు - వెంకటేగౌడ

చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

జీడీ నెల్లూరు - కృపాలక్ష్మి

నగరి - ఆర్‌.కె.రోజా

మదనపల్లె - నజీర్‌ అహ్మద్‌

పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

రాజంపేట – ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి

కడప – షేక్‌ అంజాద్‌ బాషా

బద్వేలు - డాక్టర్‌ దాసరి సుధ

కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

మైదుకూరు - రఘురామిరెడ్డి

జమ్మలమడుగు - సుధీర్‌రెడ్డి

ప్రొద్దుటూరు - శివప్రసాద్‌రెడ్డి

కర్నూలు - ఇంతియాజ్‌

మంత్రాలయం - బాలనాగిరెడ్డి

ఎమ్మిగనూరు - బుట్టా రేణుక

పత్తికొండ – కంగాటి శ్రీదేవి

ఆలూరు - బి.విరూపాక్షి

నందికొట్కూరు - డాక్టర్‌ ధారా సుధీర్‌

పాణ్యం - కాటసాని రాంభూపాల్‌రెడ్డి

డోన్‌ - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి

నంద్యాల – శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి

కల్యాణదుర్గం - ఉషశ్రీచరణ్‌

మడకశిర – వీరా లక్కప్ప

శింగనమల – వీరాంజనేయులు

Tags:    

Similar News