కేంద్ర బడ్జెట్ పై వైసీపీ పెదవి విరుపు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై అధికార వైసీపీ పెదవి విరించింది. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని చెప్పింది

Update: 2022-02-02 01:35 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై అధికార వైసీపీ పెదవి విరించింది. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని చెప్పింది. అంకెలు చూడటానికి బాగున్నా బడ్జెట్ ఉపయోగకరంగా లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని చెప్పారు. పన్నుల వాటాలో కూడా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఏపీకి దక్కుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రుణాల పరిమితికి....
కేంద్ర ప్రభుత్వం రుణాల విషయంలో ఆంక్షలు పెడుతుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దేశ ఆర్థిక లోటు ఈ ఏడాది 6.4 శాతం ఉండవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారని, ఏపీ ఆర్థిక లోటు ఈ ఏడాది 5.38 శాతం, 2022లో 3.49 శాతం మాత్రమేనని తెలిపారు. ఎఫ‌ఆర్‌జీఎం పరిమితి కేంద్ర రాష్ట్రాలకు ఒక్క విధంగానే ఉంటుందని విజయసాయి రెడ్డి చెప్పారు. ఎఫ్ఆర్‌జీఎం పరిధిని కేంద్ర ప్రభుత్వం దాటుతూ రాష్ట్రాలకు మాత్రం ఆంక్షలను పెడుతుందని ఆయన కేంద్రంపై విరుచుకు పడ్డారు.


Tags:    

Similar News