కొత్తపల్లి పడవలతో నిరసన
నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆందోళనకు దిగారు;
నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో పడవలతో ర్యాలీ చేస్తూ ఆయన నిరసన తెలియజేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని....
భీమవరం కాదని నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలను నిత్యం తెలియజేస్తున్నారు. అందులో భాగంగా పడవలతో ఆయన ర్యాలీ చేశారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకూ ఆందోళన విరమించబోమని కొత్త పల్లి సుబ్బారాయుడు తెలిపారు.