Ys Jagan : వైసీపీ అధినేత జగన్ హాట్ కామెంట్స్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు పర్చడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు పర్చడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఈరోజు ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమై మాట్లాడుతూ రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలన్నారు. కనీసం నాలుగు నెలలవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బడ్జెట్ లో ఏ స్కీమ్ లకు ఎంతిస్తారో చెప్పాల్సి వస్తుందని వెనకడగు వేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.
రెండు ప్రభుత్వాలను...
రెండు ప్రభుత్వాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, ఎవరి హయాంలో మంచి జరిగిందో తెలియనంతగా లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేన్న ధీమాను జగన్ వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కుటుంబానికి జరిగిన మంచిపై ప్రతి ఇంట్లో చర్చ ప్రారంభమయిందన్నారు. ప్రజలు సులువుగానే వీరి మాయమాటలను అర్థం చేసుకున్నారని తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు.