కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ఇళ్ల స్థలాల ఎంపికపై ఆయన మండి పడ్డారు;

Update: 2022-01-07 04:28 GMT

వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. కావలిలో ఇళ్ల స్థలాల ఎంపికపై ఆయన మండి పడ్డారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లపై అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు పెన్నా నది ఒడ్డున జగనన్న లే అవుట్ ను ఎలా ఎంపిక చేస్తారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

ఎలా ఎంపిక చేస్తారు?

అక్కడ చిన్న వర్షానికి కూడా నీరు చేరుతుందని అధికారులకు, మంత్రులకు తెలియదా? అని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండి పడ్డారు. ఇటువంటి అధికారులతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిలో అధికార పార్టీని కావాలని కొందరు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. 


Tags:    

Similar News