వైసీపీ ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి విషమం

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరధరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Update: 2022-11-02 04:47 GMT

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరధరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను హుటాహుటిన అవుకులోని తన స్వగృహం నుంచి హైదరాబాద్ లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు.

వెంటిలేటర్ పై...
వైద్యులు ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాలేయం, ఊపిరితిత్తుల సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయన క్రమంగా కోలుకుంటారని, తొలుత వంద శాతం ఆక్సిజన్ ఇచ్చిన వైద్యులు ఇప్పుడు 60 శాతం ఇస్తుండటంతో కొంత మెరుగుపడిందని బంధువులు చెబుతున్నారు.


Tags:    

Similar News