ఎన్నికల కమిషన్ కు రాజు ఫిర్యాదు
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ నియామకం చెల్లదని పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తెలిపారు.
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ నియామకం చెల్లదని పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ను కలిసిన రఘురామ కృష్ణరాజు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటే వైసీపీ లో జీవిత కాల అధ్యక్ష నియామకాన్ని నిలిపేయాలని కోరారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ప్రాధమిక నిబంధనలను తమ పార్టీ ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు.
పార్టీ సభ్యుడిగా....
పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్న తాను తెలియజేస్తున్నానని చెప్పారు. చట్టాలకు విరుద్ధంగా ప్లీనరీలో తీర్మానాలను రూపొందించారని పేర్కొన్నారు. అంతర్గత ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జీవితకాల అధ్యక్షుడిగా నియామకంపై ఆయన అభ్యంతరం తెలిపారు.