మోదీని కలిసిన వైసీపీ ఎంపీలు
వైసీపీ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు;
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి రావడం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అవసరం కావడంతో రాష్ట్ర పరిస్థితి బాగా లేదు.
రాష్ట్ర పరిస్థితిని....
దీంతో వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని వారు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించాలని కోరారు. మోదీని కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి తదితరులున్నారు.