Ys Jagan : వై సీ పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు;

Update: 2024-08-15 06:10 GMT
ys jagan, ycp chief, independence day, tadepalli
  • whatsapp icon

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదలరజని, లేళ్ల అప్పిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వైవీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.

బానిస సంకెళ్లను...
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు అని వైఎస్ జగన్ అన్నారు. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు అని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ జగన్ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులందరికీ నివాళుర్పిస్తున్నానని తెలిపారు.


Tags:    

Similar News