స్పీకర్ తో భేటీ అయిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు

Update: 2024-01-29 07:58 GMT

స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిపై అనర్హత పిటీషన్ పై విచారించేందుకు స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. అయితే స్పీకర్ ను కలిసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు హాజరయ్యారు. వారు నలుగురు విడివిడిగా స్పీకర్ ను కలసి తమ వివరణను వినిపించి వచ్చారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు.

హైకోర్టులో పిటీషన్...
తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపాలని కూడా కోరారు. తొలుత మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ ను కలవగా, తర్వాత కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి కలిశారు. అయితే తాము వివరణ ఇవ్వడానికి నాలుగు వారాలు గడువును స్పీకర్ ను కోరారు. లంచ్ తర్వాత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసే అవకాశముంది. దీంతో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటీషన్ వేశారు. తమకు ఇచ్చిననోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.


Tags:    

Similar News