Ys Jagan : నేడు ఉరవకొండకు వైఎస్ జగన్
ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. నాలుగో విడత వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. నాలుగో విడత వైఎస్సార్ ఆసరా నిధులను విడుదల చేయనున్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి జగన్ ఉరవ కొండకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్దిదారులకు అందచేయనున్నారు. అంతకు ముందు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
6,304 కోట్ల పంపిణీ...
ఈరోజు 79 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 6,394 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ వైఎస్సార్ కార్యక్రమం ఈ ఏడాది చివరి కార్యక్రమం కావడంతో మొత్తం నిధులను జమ చేసినట్లవుతుందని, వారికి ఇచ్చిన హామీల మేరకే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరాగా నిలిచారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉరవకొండలో సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఫిబ్రవరి ఐదో తేదీ వరకూ వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది.