Ys Sharmila : ఆ జగన్ నా అన్న.. ఈ జగన్ ఎవరో నాకు తెలియదు

కడప కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి గా తాను పోటీ చేస్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు.

Update: 2024-04-02 12:10 GMT

కడప కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి గా తాను పోటీ చేస్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ నిర్ణయం తనకు సులువైంది కాదని, ఈ నిర్ణయం నా కుటుంబాన్ని చీలుస్తుంది అని తెలుసునని అన్నారు. వైఎస్సార్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుంది అని తెలుసు నని, అయినా తప్పని సరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయంమిది అని ఆమె అన్నారు. జగన్ మోహన్ రెడ్డి త అన్న అని, అన్న అంటే తనకు ద్వేషం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నా రక్తం అని కూడా అన్నారు. ఎన్నికల్లో తనను చెల్లే కాదు బిడ్డ అని జగన్ అన్నాడని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడన్నారు.

అందుకే పోటీ చేస్తున్నా...
ఈ జగన్ మోహన్ రెడ్డి తనకు పరిచయం లేదని అన్నారు. జగన్ తన అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడన్న వైఎస్ షర్మిల కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే టిక్కెట్ ఇచ్చాడని, అది తట్టుకోలేక పోయా నని హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదని అన్నారు. హత్య చేసిన వాళ్ళు,చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారని ఆమె ఆరో్పించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవని వైఎస్ షర్మిల అన్నారు. అధికారం వాడుకొని వాళ్ళనే జగన్ రక్షిస్తున్నారని, అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని, తమకుకు చాలా ఆలస్యంగా అర్థం అయిందన్నారు.


Tags:    

Similar News