Ys Sunitha : కడప ఎస్పీని కలిసిన వైఎస్ సునీత

కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజును మాజీ మంత్రి వైఎష్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతరెడ్డి కలిశారు.;

Update: 2024-08-08 07:12 GMT
ys sunita, harshavardhan raju, kadapa sp
  • whatsapp icon

కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజును మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతరెడ్డి కలిశారు. తన తండ్రి వివేకా హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సీబీఐకి.. తమకు పోలీసులు సహకరించలేదని సునీత ఈ సందర్భంగా ఎస్పీకి వివరించారు.

పోలీసులపై....
స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్న సునీత, వివేకా హత్య కేసులో తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సునీత కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజును డిమాండ్ చేసారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని ఎస్పీ దృష్టికి తెచ్చిన సునీత, సీబీఐకి ఈ కేసులో సహకరించాలని కోరారు.


Tags:    

Similar News