YSRCP : వైస్సార్సీపీకి రిలీఫ్.. కోర్టు స్టేటస్ కో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది

Update: 2024-06-26 12:07 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ కార్యాలయ భవనాల కూల్చి వేతలపై హైకోర్టు స్టే విధించింది. రేపటి వరకూ ఈ స్టే కొనసాగుతుందని తెలిపింది. ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలను అందచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

పది జిల్లాల్లో...
మొత్తం పది జిల్లాల్లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న వైసీపీ భవనాలకు ఈ ఊరట లభించింది. రేపు వీటిపై విచారణ జరుపుతామని తెలిపింది. మొత్తం 26 జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాలను నిర్మించారని మున్సిపల్ అధికారులు ఆ యా జిల్లాల పార్టీ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పది జిల్లాల పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ రేపు జరగనుంది.


Tags:    

Similar News