వైసీపీ నేత జనసేనలోకి.. ఎందుకంటే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో నేడు చేరనున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో నేడు చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో చేరనున్నారు. ఇప్పటికే రాజోలు నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు కొంతకాలం క్రితం పవన్ కల్యాణ్ ను కలిశారు. తాను పార్టీలోకి వస్తానని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
పార్టీ మారడంతో...
పవన్ కల్యాణ్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈరోజు పవన్ కల్యాణ్ సమక్షంలో బొంతు రాజేశ్వరరావు జనసేన కండువా కప్పుకోనున్నారు. గత ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన రాజేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన తరుపున గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీ మద్దతుదారుగా నిలిచారు. జగన్ ప్రభుత్వంలో బొంతు రాజేశ్వరరావుకు నామినేటెడ్ పోస్టు దక్కినా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో జనసేనలో చేరుతున్నారని తెలిసింది.