వైసీపీ ఎమ్మెల్సీ మృతి... నిన్న శాసనమండలికి హాజరై?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్సీసా మృతి చెందారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్సీసా మృతి చెందారు. అకస్మాత్తుగా ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 65 సంవత్సరాలు వయసు కలిగిన కరీమున్నీసా గుండెపోటుతో మరణించారు. నిన్న జరిగిన శాసనమండలి సమావేశానికి కూడా కరీమున్నీసా హాజరయ్యారు.
కార్పొరేటర్ నుంచి...
కరీమున్నీసా విజయవాడ నగరంలో 54వ డివిజన్ నుంచి గతంలో కార్పొరేటర్ గా తెలిచారు. ఆమె కుమారుడు వైసీపీలో యాక్టివ్ గా ఉండటంతో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీమున్నీసాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తో కలసి మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కరీమున్నీసా మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని ప్రకటించారు.