దుష్టచతుష్టయంపై తీర్మానం.. చర్చ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 8,9 వ తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది.

Update: 2022-07-06 08:15 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 8,9 వ తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో ఈ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ ప్లీనరీ కోసం జగన్ దాదాపు 32 కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలు తమ పనులను పూర్తి చేస్తున్నాయి. నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో వర్షం కురిసినా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరవుతుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

9 అంశాలపై...
8వ తేదీ ఉదయం గంటలకు వైసీపీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. వైసీపీ ప్లీనరీలో 9 అంశాలపై తీర్మానం చేస్తారు. చర్చించనున్నారు. ఒక్కొక్క అంశంపై ఐదుగురు మాట్లాడతారు. మహిళ సాధికారిత, దిశ చట్టం, విద్య, వైద్యం, పరిపాలన సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక సాధికారతతో పాటు ఎల్లోమీడియా దుష్ట చతుష్టయం పైన కూడా తీర్మానం ఉంటుంది.


Tags:    

Similar News