ఆరు ఎంపీపీ పదవులు వైసీపీవే
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.;
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు చోట్ల వైసీపీ నేతలు ఎంపీపీగా విజయం సాధించారు. ఒక్క రామకుప్పం మండలం మాత్రం సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదా పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
రామకుప్పం మినహా...
11 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నిక జరిగింది. ఇందులో తొమ్మిది చోట్ల వైసీపీ గెలిచింది. రామకుప్పం మండలం ఎన్నిక మాత్రం వాయిదా పడింది. సంతమాగులూరు, పిడుగురాళ్ల, ఆలేరు, ఎస్ రాయవరం, విడవనకల్లు, చెన్నై కొత్తపల్లి మండలాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎంపీపీ అభ్యర్థులు ఎన్నికయ్యారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.