నేడే వైఎస్సార్ కాపు నేస్తం.. ఒక్కో అకౌంట్ లో 15000 రూపాయలు
నిడదవోలులో కాపు నేస్తం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. లండన్ పర్యటన
నేడు వైఎస్సార్ కాపు నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అర్హులైన 3,57,844 మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
నిడదవోలులో కాపు నేస్తం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. లండన్ పర్యటన తర్వాత మొదటి సారి బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాల పై సీఎం స్పందించే అవకాశం ఉంది. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఈ ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి కూడా అనుకోని కారణాలతో జాబితాలో పేర్లు లేనివాళ్లు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు.