Ys Jagan : పోసాని అరెస్ట్ పై జగన్ ఏమన్నారంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై స్పందించారు;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై స్పందించారు. బెంగళూరులో ఉన్న ఆయన ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో పాటు పోసాని సతీమణి కుసుమలతకు ఫోన్ చేసి పరామర్శించారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అక్రమమని వైఎస్ జగన్ అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారన్నారు.
పోసాని భార్యకు ఫోన్ చేసి...
పోసాని కృష్ణమురళి సతీమణి కుసుమలతకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, న్యాయం మనవైపు ఉందని చెప్పిన జగన్ పోసానిని అక్రమ పద్ధతిలోనే అరెస్ట్ చేశారని జగన్ అన్నారు.