Ys Jagan : ప్రధాని మోదీకి వైఎస్ జగన్ ఘాటు లేఖ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీ లిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పబట్టే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను ప్రభుత్వం తగ్గేలా చర్యలు తీసుకున్నాయనితెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించి జనాభా తగ్గిస్తే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడాన్ని జగన్ ఆక్షేపించారు. వచ్చే ఏడది జరగనున్న డీ లిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదిన పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు తగ్గకుండా చూడాలని లేఖలో జగన్ ప్రధాని మోదీని కోరారు.
సీట్ల విషయంలో...
సీట్ల విషయంలో దక్షిణాదికి అన్యాయం చేయవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. గత దశాబ్దన్నర కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గిందని, జనాభా ప్రాతిపదికన సీట్లను నిర్ణయిస్తే ఈ ప్రాంత భాగస్వామ్యం తగ్గుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్న ఆందోళన ప్రారంభమయిందన్న జగన్ దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని లేఖలో తెలిపారు. పార్లమెంటు లో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని జగన్ లేఖలో కోరారు. దక్షిణాది రాష్ట్రాలలో డీ లిమిటేషన్ ప్రక్రియ తర్వాత సీట్లు తగ్గకుండా చూడాలని జగన్ కోరారు. ఈ మేరకు కసరత్తు నిర్వహించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోరారు.