Tirumala : సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.;

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. వేసవి తీవ్రత తగలకుండా భక్తులకు అన్ని వసతులను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. గత పది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరీక్షలు ప్రారంభమయినా తిరుమలలో రద్దీ మాత్రం తగ్గడం లేదు.
నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు...
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 2025.26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పాలకమండలి ఆమోదించనుంది. ఈరోజు ఉదయం పది గంటలకు జూన్ నెలకు సంబంధించి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.